నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా?

Can we go to temple after eating Non vegetarian

01:27 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Can we go to temple after eating Non vegetarian

మాములుగా చాలా మంది నాన్ వెజ్ తింటే గుడికి వెళ్ళరు. ఎందుకంటే దేవుడు సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు అటువంటివి తినకూడదని అందరి నమ్మకం. ఒకవేళ నాన్ వెజ్ తిన్న గుడికి వెళ్లాలనుకునే వారు మళ్ళీ తల స్నానం చేసి వెళ్లాలనుకుంటారు. అయితే ఇది ఎంత వరకు శ్రేయష్కరం? అసలు నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. దాని గురించి పూర్తి వివరాలు మీకోసం.. గుడ్డు మరియు మాంసాహార పదార్థాలు రజో గుణ, తమోగుణ సంబంధమైన పదార్థాలు. ఇటువంటి ఆహారపదార్థాలన్నీ కోపము మరియు కామ వికార కోరికలు(రజో) గుణాలకు ప్రతీకలు.

అలాంటి మాంసపు పదార్థాలను స్వీకరించడం వల్ల సత్వ గుణ ప్రభావం తగ్గి రజో గుణాల ప్రభావం పెరుగుతుంది. సాత్వికమైన ఆలోచనలు, క్రియా కలాపములను సత్వ గుణం అంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు, దైవరాధన చేసే సమయంలో ప్రధానంగా సత్వ గుణం కలిగి ఉండాలి. రజోగుణ, తమోగుణాల ప్రభావం వల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంది. దాని వల్ల మన దైవరాధన సఫలం అవ్వదు. సత్వగుణం స్థిరంగా ఉండాలంటే ఆహారం కూడా సాత్వికంగా ఉండవలెను. సాత్విక ఆహారం అంటే పాలు, పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు తినవచ్చు. కాబట్టి దైవారాధన సమయంలో మాంసాహార పదార్థాలు నిషిద్ధం.

ఇది కూడా చదవండి: నాలుగు రోజులకే 50 కోట్లు దాటేసిన 'గ్యారేజ్'

ఇది కూడా చదవండి: ఇక నుంచి 24 గంటలూ 'జీ' సినిమాలు!

ఇది కూడా చదవండి: తాను సంపాదించిందంతా రాసిచ్చేశాడు... ఎంతో తెలిస్తే షాకవుతాం!

English summary

Can we go to temple after eating Non vegetarian