పవన్ వచ్చేనా .... పాప ప్రాణాలు నిలబెట్టేనా ....

Cancer Child Waiting For Pawan Kalyan

12:26 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Cancer Child Waiting For Pawan Kalyan

ఆ చిన్నారి ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమామి... ఆ పాప ప్రస్తుతం ఆసుపత్రిలో వుంది. ... పవన్ వస్తే అన్ని తగ్గిపోతాయని ఎదురు చూస్తోంది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన ఈ న్యూస్ గురించే హాట్ టాపిక్ రన్ అవుతోంది. ఇంతకీ పవన్ .వెళ్తాడా ....ఏమన్నా డొనేషన్ ప్రకటించి ఆ చిన్నారిని ఆదుకుంటాడా ... ప్రాణం నిలబెడతాడా అనే టాపిక్ నడుస్తోంది. అసలు ఆపాపకు ఏమైంది .. ఎందుకు పవన్ కోసం ఎదురుచూస్తోంది వంటి విషయాల్లోకి వెళ్తే, పశ్చిమగోదావరి, భీమవరం లోని పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల ఆరేళ్ల కుమార్తె నూకల కనక చంద్ర దీపికకు అభిమాన హీరో పవన్ అట. పవన్ వస్తే, ఆమెకు వచ్చిన జ్వరం తగ్గిపోతుందని చెపుతోంది.

ఇంతకీ ఆ పాపకు వచ్చింది జ్వరమా అంటే కాదట. పాపకు నీరసంగా ఉండటంతో నెల రోజుల కిందట ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, బ్లడ్‌ క్యాన్సర్‌ అని చెప్పారట. దీంతో పాప తల్లితండ్రులు ఓరి భగవంతుడా ఏమిటీ ఈ పరీక్ష అంటూ బెంగ పెట్టేసుకున్నారు. అయితే ఆ పాపకి మాత్రం కాన్సర్ అనే విషయం తెలియనీయకుండా దిగమింగుకుని, పాప ప్రాణాలు నిలేబెట్టే యత్నం చేస్తున్నారు. జ్వరం అని చెప్పి సర్ది చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమామి అయిన ఈ పాప, 'నాకు పవన్‌కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం. ఈ అంకుల్‌ ఒక్కసారి నా దగ్గరకొస్తే నాకొచ్చిన జ్వరం త్వరగా తగ్గిపోతుంది' అని అంటోంది. ఇది విన్న వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.తప్పక పవన్‌ అంకుల్‌ వస్తారని ఎదురు చూస్తున్నానంటోందీ చిన్నారి. చిన్నప్పటి నుంచి పవన్‌కల్యాణ్‌ అంటే ఎంతో ఇష్టమని, వాళ్లు ఉండే చిన్న గది మొత్తం ఆయన పవన్ ఫొటోలతోనే నింపేసిందని తల్లిదండ్రులు చెప్పుకుని, ఎలా తీసుకు వచ్చేది అంటూ కుమిలిపోతున్నారు.

కాగా ఈ కాన్సర్ వ్యాధి ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ తేల్చి చెప్పడంతో ఈ చిన్నారి వైద్యానికి అవసరమయ్యే కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేయించేలా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్‌ హైపవర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.గోవిందరాజ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చిన్నారి విషయం తీసుకెళ్లి త్వరలోనే వైద్యచికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉన్న ఇంటిని ఇప్పటికే వైద్యఖర్చుల నిమిత్తం తనఖా పెట్టారు. మరింత నగదు అవసరం కావడంతో దాతల సాయం కోసం చిన్నారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇదేమీ తెలియని ఆ పాప తనకేదో జ్వరం వచ్చిందని, పవన్‌కల్యాణ్‌ అంకుల్‌ వచ్చి చూస్తే తగ్గిపోతుందని చెప్పడం, విన్నవాళ్ళు కళ్ళు చెమర్చడం జరుగుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో రిక్వెస్ట్ గా కూడా వెళ్ళింది. గతంలో ఒపాపకు ఇలాగే జబ్బు చేస్తే , పవన్ స్వయంగా వెళ్లి పరామర్శించిన నేపధ్యంలో ఇప్పుడు పవన్ ఎలా స్పందిస్తాడోనని అంతా చర్చించుకుంటున్నారు.

English summary

A Baby named Kanaka Chandra Deepika from Bhimavaram in West Godavari District was suffering from Blood Cancer. She was a big fan of Power Star Pawan Kalyan and she was waiting to meet pawan kalyan.Now this news was posting in Social media that requesting pawan kalyan to meet that baby child.