కృష్ణ భగవాన్ కి క్యాన్సెర్ కాదట

Cancer for Krishna Bhagavan

11:30 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Cancer for Krishna Bhagavan

తన మార్క్ కామెడీ టైమింగ్ తో ప్రత్యర్ధి నటుల పై పంచ్ లు అవలీలగా వేసి ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ భగవాన్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనపడటం లేదు? అయనకు ఏమైంది అన్న‌దాని పై టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల వార్త‌లు పుకార్లు షికార్లు చేశాయి. ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌న్న వార్త‌లు జోరుగా స్ప్రెడ్ అయ్యాయి. కృష్ణ భ‌గ‌వాన్‌కు క్యాన్స‌ర్ సోకింద‌ని.. దీంతో ఆయ‌న పూర్తిగా నీర‌సంగా ఉన్నార‌ని ట్రీట్‌మెంట్ జ‌రుగుతుంద‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ పుకార్ల పై కృష్ణ భగవాన్ మాట్లాడుతూ, నాకు వెన్ను నొప్పి వస్తే క్యాన్సర్ వచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ వార్త‌ల‌ను ఎవ‌రూ ఎందుకు స్ర్పెడ్ చేస్తున్నారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని ఆయ‌న వాపోయారు. తాను తొందరలోనే కోలుకుంటానని చెప్పారు. ఇక కృష్ణ‌భ‌గ‌వాన్‌ పై వ‌చ్చిన పుకార్ల‌కు తోడు ఆయ‌న సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎవ‌రికి వారు ఆయ‌న‌కు క్యాన్స‌ర్ రావ‌డం వ‌ల్లే సినిమాల్లో త‌క్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని గుస‌గుస‌లాడుకున్నారు. చివ‌ర‌కు ఆయ‌నే స్వ‌యంగా త‌న‌కు వెన్ను నొప్పి వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అదండీ కృష్ణ భగవాన్ క్యాన్సెర్ కధ.

English summary

Cancer for Krishna Bhagavan. Star comedian Krishna Bhagavan reacted about rumours of him. That is he is suffering from cancer.