మజా ఇచ్చే జెల్లీ సాగా

Candy Crush Jelly Saga Game

04:20 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Candy Crush Jelly Saga Game

'క్యాండీ క్రష్'.. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్... ఏ ప్లాట్‌ఫాం స్మార్ట్‌ఫోన్ అయినా అందులో ఈ గేమ్‌ ఉండాల్సిందే. ఈ గేమ్ ఆడే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. క్యాండీ క్రష్ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ గేమ్ డెవలపర్ 'కింగ్' కొత్త కొత్త గేమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే క్యాండీ క్రష్ జెల్లీ సాగా అనే కొత్త గేమ్‌ను విడుదల చేసింది. కొద్ది రోజుల్లోనే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్ కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఈ అప్‌డేట్ పొందొచ్చు. 100కు పైగా జ్యులిషియస్ లెవల్స్, జెల్లీ క్వీన్ బాస్ మోడ్స్, కలర్ బాంబ్ లాలిపాప్ బూస్టర్, ఆకట్టుకునే కొత్త రకాల క్యాండీలు, ఇంప్రూవ్డ్ ఫేస్‌బుక్ కనెక్టివిటీ, మొబైల్స్, టాబ్లెట్ పీసీల మధ్య గేమ్ సింకింగ్ వంటి ఫీచర్లను అప్‌డేట్‌లో అందిస్తోంది. ఆండ్రాయిడ్ 2.3 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

English summary

After the great reponse to candy crush game that company released anew game called candy crush jelly saga.There were almost 100 wonderful levels in this game