కెనాన్ నుంచి ఫుల్ హెచ్‌డీ కెమెరాలు..

Canon Launches Full HD Cameras

01:30 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Canon Launches Full HD Cameras

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ కెనాన్ నూతన డిజిటల్ కెమెరాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇక్సస్ సిరీస్‌లో ఫుల్ హెచ్ డీ కెమెరాలను మార్కెట్ లోకి తెచ్చింది. ఇక్సస్ 285 హెచ్‌ఎస్, ఇక్సస్ 180, ఇక్సస్ 175 పేరిట విడుదలైన ఈ కెమెరాల ధర రూ.7,995 నుంచి ప్రారంభమవుతుంది. ఈవోఎస్ సిరీస్‌లోని ఎం10 కెమెరా రూ.39,995 ధరకు, ఈవోఎస్ ఎం3 కెమెరా రూ.49,995 ధరకు లభ్యం కానున్నాయి. కెమెరాలను కొత్తగా వాడే వారి కోసం సౌకర్యవంతంగా ఉండేలా ఈ నూతన మోడల్స్‌ను తీర్చిదిద్దారు. ఇక్సస్ సిరీస్‌లోని అన్ని కెమెరాల్లోనూ 20 మెగాపిక్సల్ సెన్సార్‌ను అందిస్తున్నారు. ఇది కెనాన్ డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక్సస్ 285 ద్వారా ఫుల్ హెచ్‌డీ వీడియోలను రికార్డింగ్ చేసుకునేందుకు వీలుంది. దీని ధర రూ.12,995. వైఫై, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఇక్సస్ 180 దాదాపు 12ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. దీని ధర రూ.7,995. అదేవిధంగా ఇక్సస్ 175 కెమెరాలో 8ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను ఇస్తున్నారు. దీని ధర రూ.6,995.

ఈవోఎస్ ఎం3లో 24 మెగాపిక్సల్ సెన్సార్, హైబ్రిడ్ సీఎంవోఎస్ ఏఎఫ్3 ఆటోఫోకసింగ్ సిస్టమ్, కెనాన్ డిజిక్ 6 ఇమేజ్ ప్రాసెసర్, టచ్ స్క్రీన్ ఎల్‌సీడీ, బరస్ట్ మోడ్ వంటి ఫీచర్లను ఉన్నాయి. ఈవోఎస్ ఎం10లో 18 మెగాపిక్సల్ సెన్సార్, హైబ్రిడ్ సీఎంవోఎస్ ఏఎఫ్ 2, డిజిక్ 6 ఇమేజ్ ప్రాసెసర్, ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

English summary

Canon company launched new full hd cameras named Ixus 285 HS, Ixus 180, and Ixus 175 this camera series was at the starting price of Rs. 7,995 and EOS M10 camera at Rs. 39,995, EOS M3 for Rs. 49,995.