కెనాన్ నుంచి మూడు కొత్త కెమెరాలు

Canon Launches Three New HD cameras

12:14 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Canon Launches Three New HD cameras

ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ కెనాన్ 3 సరికొత్త డిజిటల్ కెమెరాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కెనాన్ ఈఓఎస్ 80డి, పవర్‌షాట్ జీ7ఎక్స్ మార్క్ 2, పవర్‌షాట్ ఎస్‌ఎక్స్720 హెచ్‌ఎస్ పేరిట అందుబాటులోకి రానున్నాయి. కెనాన్ ఈఓఎస్ 80డి కెమెరా ధర రూ.80,400. ఈ ఫోన్ ఏప్రిల్ లో అందుబాటులోకి రానుంది. ఇందులో 24.2 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, డిజిక్ 6 ఇమేజ్ ప్రాసెసర్, 7 ఎఫ్‌పీఎస్ బరస్ట్ మోడ్, 1080P వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కెనాన్ పవర్‌షాట్ జీ7ఎక్స్ మార్క్ 2 ధర రూ.47 వేలు. ఇది మేలో లభ్యం కానుంది. దీంట్లో 20.1 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, డిజిక్ 7 ఇమేజ్ ప్రాసెసర్, 40 ఎక్స్ ఆప్టికల్ జూమ్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, 3 ఇంచ్ టచ్ స్క్రీన్, 1080P వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. కెనాన్ పవర్‌షాట్ ఎస్‌ఎక్స్ 720 హెచ్‌ఎస్ కెమెరా ధర రూ.25,500. ఇది జూన్ లో అందుబాటులోకి రానుంది. 40ఎక్స్ ఆప్టికల్ జూమ్, వైఫై, 20.3 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, డిజిక్ 6 ఇమేజ్ ప్రాసెసర్, 3 ఇంచ్ ఎల్‌సీడీ స్క్రీన్, జూమ్ ఫ్రేమింగ్, స్టోరీ హైలైట్, క్రియేటివ్ షాట్ ఫీచర్లు ఉన్నాయి.

English summary

Worlds Famous Camera making company Canon launched three new cameras into the market.The three came names was Canon EOS 80D, PowerShot G7X Mark II, PowerShot SX720 HS.These cameras comes with the features like features like Zoom Framing, Story Highlight, and Creative Shot etc.