కెప్టెన్‌ అమెరికా టైలర్‌కి కోటి వ్యూలు !!

Captain America Civil War trailer got 1 crore views in 24 hours

04:27 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Captain America Civil War trailer got 1 crore views in 24 hours

ఎవేంజర్స్‌ చిత్రంలో ఒక పాత్ర అయినటువంటి 'కెప్టెన్‌ అమెరికా' హీరోగా తెరకెక్కిన హాలీవుడ్ తాజా చిత్రం 'కెప్టెన్‌ అమెరికా సివిల్‌ వార్‌'. ఎవేంజర్స్‌ సూపర్‌ హీరోల గ్రూప్‌నుండి ఐరన్‌మ్యాన్‌ విడిపోయాక ఏం జరిగింది? ఐరన్‌మ్యాన్‌కి - కెప్టెన్‌ అమెరికాకి మధ్య జరిగిన ఘర్షణ ఏంటి అన్న నేపధ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజై 24 గంటలు అవుతుంది. 24 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి, దీనితో ఈ చిత్రం పై అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇంతకీ సినిమాలో ఏముంది? టెక్నాలజీ పరంగా ఎలా ఉంటుంది? ఇలా చాలా ప్రశ్నలు అభిమానుల్లో వెల్లువెత్తుతున్నాయి.

2016 మే 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంధోని రూసో, జ్యో రూసోలు దర్శకత్వం వహించారు.

'కెప్టెన్‌ అమెరికా సివిల్‌ వాల్‌' టైలర్‌ను మీరు కూడా వీక్షించండి.

English summary

Captain America Civil War trailer got 1 crore views in 24 hours. It is a Hollywood movie directed by Anthony Russou and Jyo Russou.