కార్లు ఎగిరిపడ్డాయి ... ట్యాంకర్ బోల్తా కొట్టింది.. ​

Cars And Oil Tanker Turns Upside In Nellore Due To Strong Winds

11:37 AM ON 13th December, 2016 By Mirchi Vilas

Cars  And Oil Tanker Turns Upside In Nellore Due To Strong Winds

ఇప్పటికే అమ్మ మరణంతో శోకసంద్రంలో తమిళ ప్రజలు మునిగి తేలుతుంటే అనుకోకుండా మరో కష్టం వచ్చి పడింది. గతంలో డిసెంబర్ లోనే వర్షం ముంచెత్తగా, ఇప్పుడు ‘వర్ద’ తుపాన్ రూపంలో వచ్చిపడిన కష్టం తట్టుకోలేని విధంగా మారింది. ముఖ్యంగా పెను తుపాను ‘వర్ద’ చెన్నైలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ బీభత్సానికి చెన్నై సిటీ వణికిపోయింది. గంటకు 140 కి.మీ. వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు భవనాలు వణికిపోవడం తో పాటు విద్యత్ స్తంభాలు, హోర్డింగులు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. అంతేకాదు కార్లు బోల్తాపడడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా విరిగిపోయిన చెట్లు కనిపించాయి. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే దారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇక గాలులు తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూపిస్తూ ట్విటర్లో ఓ వ్యక్తి ఉంచిన వీడియో పెను గాలుల ధాటిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఓ చోట పార్క్ చేసిన కార్లు గాలుల తీవ్రతకు ఓ పక్కకు ఎగిరిపడటం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. మరోవైపు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వద్ద ఈదురుగాలుల ధాటికి ఓ చమురు ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.​

English summary

Cars And Oil Tanker Turns Upside In Nellore Due To Strong Winds.