లగ్జరీ కార్లను ఇలా పడేస్తారట!

Cars are thrown at China after they get old

10:19 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Cars are thrown at China after they get old

ఇదో రకం జల్సా.. ఖరీదైన కార్లను ఎందుకు కొరగాకుండా వదిలేయడం మామూలు విషయం కాదుగా.. అసలు లగ్జరీ కార్లంటే ఎవరికీ ఇష్టం వుండదు. అందరికీ ఇష్టమే కదా.. మరి చాలా డబ్బు వెచ్చించి కొన్న కార్లను ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే చైనాలోని చెంగ్డుకి వెళ్తే మాత్రం ఓనర్స్ వద్దనుకొని వదిలేసిన కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. వాటిల్లో బెంట్లీ.. ల్యాండ్ రోవర్.. బెంజ్.. ఆడీ లాంటి లగ్జరీ కార్లే ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు కొన్ని ఖరీదైన మోటర్ సైకిళ్లు కూడా ఉన్నాయి. చాలా రోజుల నుంచి అక్కడ నిరుపయోగంగా వదిలేసి వెళ్లడంతో వాటి పై దుమ్ము.. ధూళి సరేసరి.

కార్లకు రిపేర్లు వస్తే చేయించలేక కొందరు వదిలేస్తే.. సరైన కాగితాలు లేక కొన్ని కార్లను అక్కడ వదిలేసి వెళ్లారట. ఆ ప్రాంతంలో వాహనాలు పేరుకుపోవడంతో వాటిని తీసుకెళ్లాలని అధికారులు వాటి యజమానులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కనీసం స్పందించట్లేదట. దీంతో కొన్ని కార్లను తక్కువ ధరకే అధికారులు వేలంలో అమ్మేశారు. అయినా.. అక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదట. ఎప్పటిలానే చాలామంది తమ లగ్జరీ కార్లను అక్కడ వదిలేసి వెళ్తూనే ఉన్నారట. ఇప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బాగుందండీ చోద్యం..

English summary

Cars are thrown at China after they get old