ఆడి కారు 3లక్షలు..బిఎండబ్ల్యూ 6లక్షలు

Cars for low cost in Chennai

05:11 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Cars for low cost in Chennai

చెన్నైలో మొన్న వరదలు భీబత్సాన్ని సృష్టించాయి. దాంతో చెన్నైకి ఎంతో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో చెన్నైలో కార్లు చౌకగా దొరుకుతున్నాయి. పోర్షే కారు కేవలం ఐదు లక్షలకే వచ్చేస్తుంది. మొన్న వరదల్లో షోరూముల్లో నీరు చేరి నీటమునిగి కార్లు పాడైపోయాయి. దాంతో ఈ కార్లను ఒక అమెరికా ఆధారిత ఆన్‌లైన్‌ సంస్థ వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనాలి అనుకుంటే మీరు దానికి సంబందించిన సైట్‌లో డబ్బులు కట్టి రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్టర్‌ అయిన తరువాత వేలంలో పాల్గొనవచ్చు. ఈ వేలం పాటలో కార్లు 2014, 2015 మోడల్‌కు సంబంధించిన కార్లే. ఈ కార్లుని వేలంలో కొన్న తరువాత కారు కండిషన్‌ వేలం నిర్వహకులకు ఏ మాత్రం సంబందం ఉండదని ముందే అన్ని చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వేలం పాటలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌ కారు 6 లక్షలు, 2015 మోడల్‌ ఆడి ఎ4 కారు కేవలం 3.4 లక్షలు ఇంకా పోర్షే క్యానాన్‌ 2012 మోడల్‌ కారు 5 లక్షల రేటులో అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో కార్లను ముంబాయి, ఢిల్లీ, గుజరాత్‌ పంజాబ్‌ వారు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ మొత్తం పెద్ద కంపెనీ కార్లు 110 వరకు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే మంచి కారు వేలం పాడుకోండి.

English summary

Cars for low cost in Chennai