విజయకాంత్ భార్య వివాదాస్పద వ్యాఖ్యలు - కేసు నమోదు

Case Filed Against DMDK Party Leader Vijayakanths Wife

11:28 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Case Filed Against DMDK Party Leader Vijayakanths Wife

ఎన్నికలన్నాకా విమర్శలు , ప్రతి విమర్శలు .... ఎత్తులు పై ఎత్తులు సహజం ... ఇక నేతలు కూడా ఆచితూచి మాట్లాడాలి... చిన్న తేడా వచ్చినా ఎదుటి పక్షం ఉతికి ఆరేస్తుంది. ఒక్కోసారి కేసులు కూడా పెడుతుంది. ప్రస్తుతం 5రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా తమిళనాట పసందుగా వున్నాయి. తాజాగా డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ భార్య, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోవాలని ఓటర్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రేమలత ఇటీవల ఓ బహిరంగసభలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రేమలత మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై విమర్శలు చేశారు. అంతేగాక, ‘కొన్ని పార్టీలు ఓటుకు రూ. 2 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. అలాంటి వారిని ఓటుకు రూ. లక్ష ఇవ్వమని అడగండంటూ’ ప్రేమలత ఓటర్లకు చెప్పారు. దీంతో స్థానిక అన్నాడీఎంకే నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమె మీద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

English summary

Case filed against DMDK party leader Vijaykanth's wife. Recently in a meeting she said that some political parties were giving money two to three thousand of money to vote their party and she said that ask them to give one lakh instead of three thousand.