వివాదంలో హిందీ హాస్యనటుడు

Case Filed Against Kapil Sharma

03:59 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Case Filed Against Kapil Sharma

ఈ మధ్య సినీ ప్రముఖులు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ప్రముఖ హిందీ హాస్యనటుడు నటుడు కపిల్‌ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. కపిల్‌ కామెడీ షో వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారేం కాదు. గతంలో కామెడీ నైట్స్‌ కమీడియన్‌ కీకూ శార్దా ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ వేషధారణలో ఆయన్ని అనుకరిస్తూ కించపరిచాడంటూ కీకూపై కేసు నమోదైంది. ఈ ఘటనలో కీకూ జైలుకి కూడా వెళ్లాడు. ప్రస్తుతం కపిల్‌ హోస్ట్‌ చేస్తున్న ‘ది కపిల్‌ శర్మ’ షోలో నర్సుల గురించి తప్పుగా ప్రస్తావించి మనోభావాలను కించపరిచారంటూ ఆల్‌ ఇండియా గవర్నమెంట్‌ నర్సుల ఫెడరేషన్‌ దిల్లీలో కపిల్‌పై కేసు పెట్టింది. అంతేకాకుండా మే7, 8న ప్రసారమైన ఎపిసోడ్‌లను ఆన్‌లైన్‌లో డిలీట్‌ చేయాలని, నర్సుల మనోభావాలను కించపరిచినందుకు కపిల్‌ క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితంకపిల్‌ స్వస్థలం అమృత్‌సర్‌లోని ప్రభుత్వ గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రి సిబ్బంది కూడా కపిల్‌పై కేసు పెట్టారు.

ఇవి కూడా చదవండి: బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:చిరంజీవితో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

Hindi Comedian Kapil Sharma was known for his Comedy in the TV shows in Kapil Nights Program and now a case filed on him due to his controversial act on Nurses.