ఫేస్ బుక్ లో అసభ్య ఫోటో పోస్ట్ చేసాడని .. యువతి సూసైడ్

Case filed on 20 years boy under cyber crime

10:50 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Case filed on 20 years boy under cyber crime

సోషల్ మీడియా ఎలా వాడితే అలాంటి పరిణామం చూపుతుంది. మంచి కి వాడెవరికన్నా చెడుకి వాడేవాళ్ళే ఎక్కువ వున్నారు. తాజాగా ఓ యువతితో కొంత కాలం సన్నిహితంగా ఉన్న యువకుడు ఆమెకు చెందిన అశ్లీల ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది చూసిన ఆమె, ఆ అవమానం భరించలేక రాత్రంతా ఏడ్చి చివరకు సూసైడ్ చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన సంచలనం కల్గించింది. 20 ఏళ్ళ యువకుడు, 17 ఏళ్ళ యువతి రెండేళ్ళ కిందట ప్రేమించుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇటీవల విడిపోయారు.

అయితే నాటి నుంచి ఆ యువకుడు ఆమెను మానసికంగా హింసిస్తూ బెదిరిస్తున్నాడు. ఆదివారం రాత్రి యువతికి చెందిన అశ్లీల ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇది గమనించిన ఆమె తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అవమానం తట్టుకోలేక ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సైబర్ క్రైం కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమంటే, ఎదుటి వాళ్ళ సుఖం కోరుకోవాలే తప్ప , ఎదుటివారిని బలితీసుకోవడం కాదని తెలుసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.

ఇది కూడా చూడండి: నీతా అంబానీ కాస్ట్లీ లైఫ్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

ఇది కూడా చూడండి: దారుణం: ఆ దేశం మొత్తం కూతురు వరస వాళ్లపై అత్యాచారం

ఇది కూడా చూడండి: మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

English summary

Police registered a case against 20 years boy under cyber crime.