బీహార్ ఇంటర్ టాపర్స్ పై కేసులు

Case Filed On Bihar Inter Toppers

12:57 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Case Filed On Bihar Inter Toppers

అవకతకలకు పాల్పడి ర్యాంకులు కొట్టేసిన విద్యార్ధుల బండారం బయటపడింది. దీంతో బీహార్ ఇంటర్ టాపర్స్ పై మంగళవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు సీఎం నితీశ్ కుమార్ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. 12వ తరగతి ఫలితాల్లో వీఆర్ కాలేజీకి చెందిన రూబీ రాయ్ ఆర్ట్స్ గ్రూప్ లో, సౌరభ్ సైన్స్ గ్రూప్ లో టాపర్స్ గా నిలిచారు. వీరిని ఓ ఛానల్ ఇంటర్వూ చేయగా షాకింగ్ సమాధానాలు చెప్పారు.

వీరి ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో బీహార్ ఇంటర్ బోర్డు విచారణకు కమిటీని నియమించింది. 14 మంది టాప్ ర్యాంకర్స్ కు తిరిగి పరీక్ష నిర్వహించగా ఆర్ట్ గ్రూప్ టాపర్ రూబీ రాయ్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. రీ ఎగ్జామ్ ఫలితాలను విశ్లేషించిన అధికారులు సౌరభ్, శ్రేష్ఠ, రాహుల్ కుమార్, రూబీ రాయ్ తో పాటు అవకతవకలకు పాల్పడిన వీఆర్ కాలేజ్ డైరెక్టర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఛైర్మన్ పై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:అమరావతిలో అణుబాంబుల తయారీ - పాకిస్తాన్ రూమర్లు

ఇవి కూడా చదవండి:దిమ్మ తిరిగే బంపర్ ఆఫర్ ఇస్తున్న ఆర్టీసీ

English summary

Bihar Government Filed few cases on Bihar Intermediate Toppers for cheating and An FIR has also been registered against Bachcha Rai, Director of Vishnu Rai College (VR College) and they have all been booked under IPC sections 420, 465, 467, 468, 471 and 120 (B).