సల్మాన్‌, షారుక్‌లపై కేసు

Case Filed On Salman and Sharukh

03:18 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Case Filed On Salman and Sharukh

ఇటీవలే ఓ కేసు నుంచి బయట పడిన బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ మరో కేసులో ఇరుక్కున్నాడు. అయితే సల్మాన్ తో పాటూ మరో బాలీ వుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ కూడా ఈ కేసులో వున్నాడు. ఈ మేరకు సల్మాన్‌, షారుక్‌ లపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. షూటింగ్‌ నిమిత్తం ఓ దేవాలయం సెట్‌లోకి వీరిద్దరూ పాదరక్షలతో వెళ్లగా అది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ హిందూ మహాసభల మహారాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడు భరత్‌ రాజ్‌పుత్‌ పిటిషన్‌ వేశారు.మీరట్‌లోని అదనపు జిల్లా జడ్జి విచారణకు స్వీకరించారు. ఇక మార్చి 8న విచారణ చేపడతారు.

ఈ అంశంపై తొలుత దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ తిరస్కరించిన నేపధ్యంలో సల్మాన్‌, షారుక్‌లు బిగ్‌బాస్‌ రియాల్టీ షో షూటింగ్‌ సందర్భంగా బూట్లతో కాళీ మాత ఆలయంలోకి వెళ్లి హిందువుల మనో భావాల్ని, మత విశ్వాసాల్ని దెబ్బతీశారని పేర్కొంటూ రాజ్‌పుత్‌ శుక్రవారం మరో రివిజన్‌ పిటిషన్‌ని దాఖలు చేయడంతో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విచారణకు స్వీకరించారు.

English summary

A case filed against on bollywood top heros Salman khan and Sharukh Khan.Shah Rukh Khan and Salman Khan inside a Kali temple on the sets of a tv show.Due to this Hindu Mahasabha against Salman Khan, Shah Rukh Khan and a private TV channel for showing the actors inside a temple wearing shoes during a reality show