'అల్లు అర్జున్' పై పెట్టిన కేస్ వాపస్!!

Case on Allu Arjun returned back

04:03 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Case on Allu Arjun returned back

అల్లు ఫ్యామిలీలో దాదాపు 10 ఏళ్ళుగా జరుగుతున్న కోర్టుకేసు ఇప్పటికి ముగింపుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాకి చెందిన రాహుల్‌ దేవ్‌ అనే వ్యాపారవేత్త 14 ఎకరాల స్థలంకి సంబంధించి 2004 సంవత్సరంలో అల్లు అర్జున్‌ మరియు అల్లు అర్జున్‌ ఫ్యామిలీ పై కేసు పెట్టారు. దాదాపు పదేళ్లుగా ఈ కేసు కోర్టులో నలుగుతుంది. అయితే ఈ రెండు కుటుంబాలకి చెందిన పెద్ద మనషులు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో పదేళ్లుగా నలుగుతున్న ఈ విచారణకు తెర పడింది. అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లాకి చెందిన కోర్టుకు హాజరుకాగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రంలో నటిస్తున్నాడు.

English summary

Case on Allu Arjun returned back in Ranga Reddy District court.