అవార్డులు ,రివార్డులకు తోడు కోర్టు నోటీసులు

Case On Bajirao Mastani Movie

10:55 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Case On Bajirao Mastani Movie

రికార్డులు బద్దలు కొట్టి, అవార్డులను సొంతంచేసుకున్న సంజయ్‌ లీలా బన్సాలీ భారీ చిత్రం ‘‘బాజీరావు మస్తానీ’’ ఇప్పుడు కోర్టు నోటీసులు కూడా అందుకోవలసిన పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా విడుదలైన ఈ రెండు నెలల్లో పదికి పైగా ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకుంది. దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. అయితే వీటన్నింటి మధ్య ఇప్పుడు మధ్యప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం నోటీసులు కూడా అందుకుంది.

ఇంతకీ విషయమేమంటే, బాజీరావు కుటుంబ వారసులకు ఈ సినిమా విడుదలకు ముందే స్క్రిప్టు చూపనందుకు సంజాయిషీ ఇవ్వాలట. అదీ, ఆ నోటీసుల సారాంశం. ఆ కుటుంబ వారసుడు తమ్కీన్‌ ఆలీ బహదూర్‌ జబల్పూర్‌ ‘‘బాజీరావు మస్తానీ’’ సినిమా తమ రాజకుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా, చరిత్రను వక్రీకరించేలా వుందని కోర్టులో కేసు వేయడం వలన ఈ పరిస్థితికి దారితీసింది. భారత ప్రభుత్వానికి, సమాచార పౌరసంబంధాల శాఖకు, సెన్సారు బోర్డుకు ‘‘బాజీరావు మస్తానీ’’ చిత్ర నిర్మాత, దర్శకులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే రాజ కుటుంబీకులు సెన్సారు బోర్డుకు, నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తూ సినిమా స్క్రిప్టును, తొలి కాపీని తమకు చూపాల్సిందిగా కోరారు. కానీ వారు స్పందించలేదు. ఈలోగా సినిమా విడుదలవడం, చరిత్రను వక్రీకరించారని తేలిపోవడం జరిగిందని పిటీషనులో పేర్కొన్నారు. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులు, కథకుడు ఇనామ్దార్‌ కూడా న్యాయస్ధానం నోటీసులో పేర్కొంది. అందుకే పూల కిరీటాలు ధరించడానికి, రాళ్ళ దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా వుండాలని అంటారు పెద్దలు.

English summary

A case was filed on Sanjay Leela Bhansali's movie Bajirao Mastani.Bajirao family members were filed case on that movie makers and send court notices to movie makers and also to Indian Information ministry and to sensor board for showing some elements were wrong in the movie