గుంటూర్‌ టాకీస్‌' సినిమా పై కేసు

Case on Guntur Talkies movie

06:15 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Case on Guntur Talkies movie

'రొటీన్‌ లవ్‌స్టోరీ, చందమామ కధలు వంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. ఈ దర్శకుడు తాజాగా తెరకెక్కించిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. జబర్ధస్త్‌ యాంకర్‌ రష్మీని హీరోయిన్‌గా తీసుకుని నరేష్‌, శ్రద్ద్ధాదాస్‌, సిద్ధూ జొన్నలగడ్డ లతో ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రం మార్చి 4న విడుదలై ఒక వర్గం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో వికలాంగుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటూ కేసు నమోదైంది. తెలంగాణ వికలాంగుల హక్కులు సమితి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో 'గుంటూర్‌ టాకీస్‌' దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేశారు.

ఆ తరువాత వికలాంగుల సమితి నాయకులు దుండి సైదులు, బానాల వెంకటయ్య మాట్లాడుతూ ఈ సినిమాలో అధిక సార్లు వికలాంగుల మనోభావాలు దెబ్బ తీశేలా వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే పీడబ్ల్యూడీ యాక్ట్‌ 1995 చట్టం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలపై కేసు నమోదు చెయ్యాలని పోలీసుల్ని డిమాండ్‌ చేశారు.

English summary

Police Case on Guntur Talkies movie in Hyderabad police station. Handicapped community leaders were filed a case on Guntur Talkies Director and Producer.