మద్రాస్‌ హైకోర్టులో వర్మ సినిమా పై కేసు

Case On Ramgopal Varma's Killing Veerappan Movie

01:06 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Case On Ramgopal Varma's Killing Veerappan Movie

వివాదాలకు పెట్టింది పేరైనా రామ్‌గోపాల్‌ వర్మ తాను ఏం చేసినా సంచలనమే. ఎప్పుడు ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో ఉంటాడు వర్మ. ఇది ఇలా ఉంటే రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమా విడుదల కాకా ముందే ఈ సినిమాతో అనేక వివాదాలకు కారణమయ్యాడు.

ఇప్పటికే వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి వర్మ కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చెయ్యగా ఇప్పుడు తమిళనాడుకు చెందిన పన్నీర్‌ సెల్వీ అనే ఒక న్యాయవాది 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా పై న్యాయవాది పన్నీర్‌ సెల్వీ మాట్లాడుతూ ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు అన్నీ అబద్దాలు అని ఈ సినిమా వల్ల తమిళనాట లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు వస్తాయని అన్నారు. ఈ చిత్రంలో కర్ణాటక పోలీసులను గొప్పగా చూపిస్తూ, తమిళు లను ముఖ్యంగా మహిళలను, పోలీసులను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. అంతేకాకుండా వీరప్పన్‌ భార్య కూడా చాలా మందిని చంపినట్లు చూపించారని అన్నారు.

ఏది ఏమైనా వర్మ సినిమాకు ఎప్పటిలాగే ఫ్రి పబ్లిసిటి వస్తుందనే చెప్పాలి. ఈ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమా 2016 జనవరి 1 న విడుదల చెయ్యనున్నారు.

English summary