కొనసాగుతున్న కాల్ మనీ దాడులు - అరెస్టులు

Cases And Arrests Continues In Call Money Case

02:09 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Cases And Arrests Continues In Call Money Case

ఎపిలో కాల్ మనీ ఆగడాలు , ఫిర్యాదులు , పోలీసుల సోదాలు , అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు బెజవాడలో 600 కేసులు నమోదైనట్లు విజయవాడ సిపి గౌతం సవాంగ్ చెప్పారు. తాజాగా బాధితుల పిర్యాడుమేరకు కృష్ణా జిల్లా గుడివాడ కాల్‌మనీ వ్యాపారి సుబ్బారెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేసారు. అతడి వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 బ్లాంక్‌ చెక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 89 పాసు పుస్తకాలు, 53 ఏటీఎం కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెజవాడలో నిరంతర నిఘా పెడతామని సిపి చెప్పారు.

కాగా, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో కాల్‌‌మనీ బాధితులు వీధికెక్కారు. న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వడ్డీ వ్యాపారి శ్రీదేవి పట్ల పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. వేధింపులకు పాల్పడుతున్న శ్రీదేవి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

వడ్డీ వ్యాపారి వేధింపులకు ఆత్మహత్యాయత్నం అప్పు చెల్లించేందుకు సిద్ధపడినా వ్యాపారి సహకరించక పోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే, పట్టణంలోని 2వ వార్డు క్రిస్టియన్‌ పేటకు చెందిన వెంకటేశ్వరమ్మ స్థానిక పటేల్‌నగర్‌లో ఉంటున్న బొలిశెట్టి రమే్‌షబాబు వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. వెంకటేశ్వరమ్మకు చెందిన 4 సెంట్ల భూమిని తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. రెండు వాయిదాల వడ్డీ చెల్లించిన వెంకటేశ్వరమ్మ తర్వాత దాన్ని కట్టలేక పోయింది. దీంతో వడ్డీ వ్యాపారి 4 సెంట్ల భూమిని తనపేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఇటీవల వెంకటేశ్వరమ్మకు డబ్బు సమకూరింది. దీంతో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తాము తమ భూమి తమకు ఇవ్వమని రమే్‌షబాబును ప్రాథేయపడినా ఫలితం కనిపించ క పోవడంతో వెంకటేశ్వరమ్మ కుమార్తె మెట్టు శివపార్వతి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి నట్లు కధనం.

కాల్ మనీ వ్యాపారులపై ఎపిలో పలుచోట్ల దాడులు ,సోదాలు , అరెస్టులు జరుగుతుండగా ఈ ప్రకంపనలు తెలంగాణాకు కూడా పాకాయి. వరంగల్ తదితర చోట్ల కాల్ మనీ ఆగడాలు వివిధ చానెల్స్ లో ప్రసరమవుతున్నాయి.

English summary