శ్మశానంలోని ఆ బాక్స్ లో ఏముందో చూసి షాకయ్యారు

Cash Bag Found At Burial Ground In Bangalore

11:26 AM ON 20th December, 2016 By Mirchi Vilas

Cash Bag Found At Burial Ground In Bangalore

పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన 2వేల నోటుతో సామాన్యుడు చిల్లర దొరక్క పాట్లు పడుతుంటే, ఆ చిల్లర కష్టాలే ఓ ఇంటి దొంగను పట్టించాయి. అదెలా అంటే, బెంగళూరులోని ఓ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు హుస్సేన్ అనే వ్యాన్ డ్రైవర్ బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో అతని బుద్ది కూడా పక్కదోవ పట్టింది. వ్యాన్ ను ఎవరూ చూడని చోటికి తరలించాడు. వ్యాన్ కనిపించకుండా చేశాడు. ఆ వ్యాన్ లో ఉన్న క్యాష్ బాక్స్ తో బెల్లందూరుకు బయల్దేరాడు. అయితే అతను అక్కడికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. ఆటో బెల్లందూరు సమీపంలోకి చేరేలోపు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ క్యాష్ బాక్స్ తో ఎక్కడి దొరికిపోతానో అని భయపడిన హుస్సేన్ ఆటో దిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆటో డ్రైవర్ డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంటని ప్రశ్నించాడు. 50 రూపాయలు ఇచ్చి కదలాలని తేల్చి చెప్పాడు. అయితే ఆ సమయంలో హుస్సేన్ దగ్గర 2వేల నోటు మాత్రమే ఉంది. ఆ నోటు ఇస్తే చిల్లర లేదని ఆటో డ్రైవర్ తీసుకోలేదు. చిల్లర మార్చడానికి ఆ చుట్టుపక్కల ఏ దుకాణాలు లేవు. తన 50 రూపాయల ఆటో చార్జ్ ఇస్తే గానీ కదలనిచ్చే ప్రసక్తే లేదని ఆ ఆటో డ్రైవర్ మంకుపట్టు పట్టాడు.

అప్పటి దాకా ఆ బాక్స్ తన దగ్గరే ఉంటుందని క్యాష్ బాక్స్ లాక్కున్నాడు. కానీ అది క్యాష్ బాక్స్ అన్న సంగతి ఆటో డ్రైవర్ కు తెలియదు. చివరికి చేసేదేమీ లేక హుస్సేన్ మళ్లీ వస్తానని వెళ్లాడు. అరగంట గడిచింది. అయినా హుస్సేన్ రాలేదు. దీంతో అనుమానమొచ్చిన ఆటో డ్రైవర్ ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గరకెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఆ బాక్స్ ట్రాఫిక్ పోలీసుకు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ట్రాఫిక్ పోలీసు తీసుకోలేదు. ఆ పక్కన పడేయమని చెప్పాడు. దీంతో సమీపంలో ఉన్న శ్మశానం కాంపౌండ్ లో ఆ బాక్స్ ను పడేసి ఆ ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు.

అలా రాత్రంతా ఆ క్యాష్ బాక్స్ శ్మశానంలోనే ఉంది. తెల్లవారిన తరువాత అటుగా వెళ్లిన కొందరు వ్యక్తులు దాన్ని చూశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి చూడగానే అందులో కొత్త నోట్ల కట్టలు ఉన్నాయి. దీంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2వేల రూపాయలు తెచ్చిన చిల్లర కష్టం అతని బాగోతాన్ని బయటపెట్టింది. వ్యాన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

English summary

Cash Bag Found At Burial Ground In Bangalore