ఈ పిల్లి బాగా స్ట్రాంగ్‌ గురూ

Cat found at concrete

12:48 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Cat found at concrete

ప్రపంచంలోనే ఎన్నో జీవులు మనిషిని మించిన ధైర్యసాహసాల్ని, మనో నిబ్బరాన్ని కలిగి ఉండే సంఘటనలు కోకొల్లలు. మనుషులకు మించిన తెలివితేటలు, సామర్ధాలు కలిగిన జీవులు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. హా..అవన్నీ ఒట్టి కట్టుకథలు అని తేల్చి పారేయకండి. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా శత్రువుల నుండి ప్రాణభయం ఉన్నప్పుడు కొన్ని జంతువులు పాటించే రక్షణాత్మక విధానాలు నిజంగా అబ్బురమనిపిస్తాయి. ఉదాహరణకు ఎంతో బితుకు బితుకు మంటూ ఉండే పిల్లులు సైతం ఒక్కోసారి ఎదురు తిరిగితే చెట్టంత మనిషి కూడా పనికి రాడు. మనం చెప్పుకునే పిల్లి మాత్రం మరో విషయంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని ఇప్పుడు అందరి చేతా ఔరా అనిపించుకుంటోంది. ఇంతకీ అసలు కథలోకి వెళదాం.

రిచర్డ్స్‌ అనే మహిళ ఒక రోజు ఉదయాన్నే తన ఇంటి తలుపు తీసి తెరిచే సరికి ఎదురుగా బ్రౌన్‌ కలర్‌లో ఉన్న ఒక పార్శిల్‌ లాంటిది కనిపించింది. దాన్ని మరింత దగ్గరగా తీక్షణంగా చూసే సరికి అది పార్శిల్‌ కాదని మొత్తంగా కాంక్రీట్‌లో కూరుకు పోయిన తన పిల్లి మోగి అని అర్థమైంది. తన పిల్లి ప్రమాదవశాత్తు కాంక్రీట్‌ మిక్చర్‌లోకి పడి పోయిన కారణంగా ఈ దుస్థితి వచ్చిందని అర్థం చేసుకన్న రిచర్డ్‌ తన పిల్లిని వెంటనే పశువైద్యుడికి దగ్గరకి తీసుకువెళ్ళింది. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పిల్లిని ఆఖరుకి డాక్టర్లు ఎంతో కష్టపడి కాపాడగలిగారు. కానీ ఎంతో గట్టిపడిపోయిన కాంక్రీట్‌ను తొలగించడం కోసం పాపం ఆ పిల్లికి ఒళ్ళంతా షేవ్‌ చేయక తప్పలేదట. బచ్చు పోయినా, తన మోగి ప్రాణం నిలబడిందని యజమాని ఆనందంగా ఉందట.

తన పిల్లిని ఇంటి డోరు ముందు చూసినప్పుడు ఏదో పార్శిల్‌ తప్పుడుగా తన ఇంటికి వచ్చిందని భావించానని, కానీ మోగి ఆ స్థితిలో చూసి చాలా కంగారు పడ్డానని రిచర్డ్‌ వాపోయింది. అంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి మోగి తన యజమాని ఇంటి ముందుకు వచ్చి చేరడం నిజంగా మోగి ధైర్య సాహసం వల్ల మాత్రమే సాధ్యమేనని రిచర్డ్‌ ఇప్పుడు అందరికి గర్వంగా చెప్పుకుంటుందిట.


English summary

Little ginger tom was found in strangely dressed with concrete. The little cat is strong and brave that’s why he escaped from danger.