ఈ పిల్లి చేసిన పని చూస్తే గుండెల్ని పిండేస్తుంది(వీడియో)

Cat funeral video

12:23 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Cat funeral video

ఎవరైనా ఈ వీడియో చూస్తే, వారి గుండెలు బరువెక్కుతాయి. మరీ సున్నిత మనస్కులైతే ఓ కన్నీటి చుక్క కారుతుంది. చనిపోయిన పిల్లిపిల్లను తల్లి పిల్లి ఓ గోతిలో పూడ్చిపెడుతున్న దృశ్యం ఎందరినో కదిలించింది. సాధారణంగా జంతువుల మృతదేహాలు ఏమవుతున్నాయన్నది చాలామందికి తెలియదు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన శునకం, పిల్లి లాంటి వాటి కళేబరాలను తొలగించే దిక్కుండదు. ఇక మానవత్వం కొంచెమైనా ప్రదర్శించని వాహనదారులు కొందరు చనిపోయిన జంతువుల కళేబరాల నుంచే వాహనాలను పోనిచ్చి వాటిని మరింత ఛిద్రం చేస్తుంటారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన వారి గుండెలను పిండేస్తోంది. ఓ మార్జాలం చనిపోయిన తన పిల్లను ఓ గోతిలో వేసి మట్టి కప్పుతున్న దృశ్యం వైరల్ అయింది. మనసులు కదిలించే ఈ వీడియో పై మీరు ఒలుక్కెయ్యండి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ.. ఇంతకీ దీనికి ఏమైంది?

ఇది కూడా చదవండి: అరె! ఎవరీమె ఇంతగా హొయలొలికిస్తుంది!

ఇది కూడా చదవండి: విశాఖలో కళామందిర్ ఓపెనింగ్ కి విచ్చేసిన హీరోయిన్స్(ఫోటోలు)

English summary

Cat funeral video. A mother did funeral for baby cat.