పిల్లిని కిడ్నాప్ చేశారట..

Cat Kidnapped In Pakistan

05:05 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Cat Kidnapped In Pakistan

సాధారణంగా మనుషులను కిడ్నాప్ చేస్తుంటారు. కానీ.. పాకిస్థాన్ లో పిల్లిని కిడ్నాప్ చేశారట. అంతే కాదు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కారణం అది మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ తెహ్రీక్‌ఇఇన్సాఫ్‌ కార్యకర్త ఇంతియాజ్‌ అసిఫ్‌కు చెందింది కావడమే. దీంతో పిల్లిని ఎత్తుకెళ్లిన కేసులో పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంతకీ ఈ మార్జాలం ధర ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు. 2014లో ఇస్లామాబాద్‌లోని డిచౌక్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇంతియాజ్‌ అసిఫ్‌ తనకెంతో ఇష్టమైన పిల్లిని తీసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం పిల్లి కనిపించకపోవడంతో పీఎంఎల్‌ఎన్‌ పార్టీకి చెందిన ముగ్గురిపై అసిఫ్‌ కేసు పెట్టారు. కొన్నాళ్లు నుంచి పార్టీ మారాల్సిందిగా వారు తనను వేధిస్తున్నారని.. వారిపైనే అనుమానంగా ఉందని పోలీసులకు తెలిపింది. సోమవారం పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి పిల్లిని అప్పగించగా.. అది తనది కాదని చెప్పింది. పార్టీ మారితే పిల్లిని తెచ్చిస్తామని గత కొన్ని రోజులుగా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని ఆమె పేర్కొంది.

English summary

Pakistan Cricket team Ex-captain Imran khan party leader Imtiaz Asif's cat has been kidnapped in pakistan. He gave complaint on this cat missing to police and police found that cat and arrested three members for kidnapping cat