రాజకీయాల్లోకి కేథరిన్‌, త్రిష

Catherine And Trisha To Act As Politicians in Their Upcoming Movies

04:14 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Catherine And Trisha To Act As Politicians in Their Upcoming Movies

చాలా మంది పాత తరం హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరం హీరోయిన్లు కూడా రాజకీయాలపై మొగ్గు చూపుతున్నారు. హాట్‌ బ్యూటీస్‌ కేథరిన్‌ , త్రిష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదు రీల్‌ జీవితంలో అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'సరైనోడు'.ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ త్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేథరిన్‌ ఎమేల్యేగా నటిస్తుందని సమాచారం. మరోపక్క ధనుష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'కోడి' ఇందులో త్రిష ఎంపీగా నటిస్తుందని సమాచారం. వీరిద్దరిలో ఒకరు తెలుగులో ఎమ్మేల్యేగా, మరొకరు తమిళంలో ఎంపీగా నటిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే.

English summary

South heroines Trisha and Catherine Tresa were entering into politics in their next movies.Catherine to act as MLA in in Sarainodu movie and Trisha to act as MP in Tamil movie.