లేడీ ఎమ్మెల్యేను వదలని బన్నీ!

Catherine Tresa playing as main heroine in Allu Arjun new movie

03:49 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Catherine Tresa playing as main heroine in Allu Arjun new movie

నీలకంఠ తెరకెక్కించిన 'చమ్మక్ చల్లో' చిత్రంలో హీరోయిన్ గా నటించిన కేథరిన్ త్రెసా ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం ప్లాప్ అయినా ఈ అమ్మడు అందాల అభినయంకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత 'పైసా' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం కూడా ప్లాప్ కావడంతో అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత 'రుద్రమదేవి' చిత్రంలో బన్నీ సరసన నటించింది. వీళ్ళ జోడి బాగుండడంతో మళ్ళీ 'సరైనోడు' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా బన్నీ రికమండ్ చేసాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు బన్నీ ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు చెయ్యడం ఇదే మొదటిసారి.

సరైనోడు తో బన్నీ కేథరిన్ ని వదిలేస్తాడేమో అనుకున్నారంతా! కానీ.. తన తదుపరి సినిమాకు కూడా ఈమెనే హీరోయిన్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేథరిన్ రానా, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు కేథరిన్ కు ప్రమోషన్ ఇవ్వాలని బన్నీ అనుకుంటున్నాడట. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రను ఆమెకే ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బన్నీ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట శృతిహాసన్ ను అనుకున్నారు.

కానీ ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. రకుల్ ను అనుకున్నారు. కానీ ఆమె మహేష్ సినిమాతో బిజీ. సమంతను సంప్రదిస్తే.. ఆమె సినిమాల నుంచి తప్పుకున్నానని చెప్పేసింది. ఇవన్నీ క్యాథరీన్ కు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ రాబోయే సినిమాలో కేథరిన్ నే మెయిన్ హీరోయిన్ అని వినిపిస్తుంది.

English summary

Catherine Tresa playing as main heroine in Allu Arjun new movie