చిరంజీవితో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్

Catherine Tresa To Act In Chiru 150th Movie

03:29 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Catherine Tresa To Act In Chiru 150th Movie

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 వ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు రంగం సిద్ధ‌మైంది. టాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరున్న వి.వి.వినాయ‌క్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క పేరును ఫైన‌లైజ్ చేసిన‌ట్టు చెబుతున్నారు. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్‌తో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్ చేయబోతోందట. నిజంగా ఎంఎల్ఎ అనుకుంటున్నారా అయితే పొరబడినట్లే. లేడీ ఎంఎల్ఎ అనే ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు..బ‌న్నీతో వ‌రుస సినిమాలు చేస్తూ, స‌రైనోడు మూవీలో లేడీ ఎమ్మెల్యేగా న‌టించిన అద‌ర‌గొట్టిన కేథ‌రిన్‌. సరైనోడులో ఎంఎల్ఎ పాత్రతో ఆకట్టుకుంది కదా.

చిరు ప్రెస్టేజియ‌స్ మూవీలో కేథ‌రిన్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌. ఈ సినిమాలో కీ రోల్‌తో పాటు చిరంజీవి సరసన ఓ పాటలో నర్తించనున్నట్లు తెలుస్తోంది. సరైనోడు స‌క్సెస్ త‌ర్వాత కేథ‌రిన్ ఏకంగా చిరుతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

ఇవి కూడా చదవండి:భార్య ప్రసవాన్ని పేస్ బుక్ లో లైవ్ షో ఇచ్చాడట!

English summary

Tollywood Heroine was grabbed a chance to act in most Prestigious project Chiranjeevi's 150th film. She was going to act in a song in Chiru 150th film.