ఇరు రాష్ట్రాల్లో 'కావేరీ' రివర్ వార్ (వీడియో)

Cauvery Water Disputes Between Karnataka And Tamilnadu

10:43 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Cauvery Water Disputes Between Karnataka And Tamilnadu

అన్నింటి కన్నా జల వివాదం అంత్యంత సున్నితమైన అంశం. రెండు రాష్ట్రాల నడుమ నీటి సమస్య జఠిలమైతే చాలా కష్టం. కరవమంటే కప్పకి, వదలమంటే పాముకి కోపం అన్నచందంగా ఉంటుంది. తాజాగా కావేరీ జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగుతున్నాయి. ఇది మరింత ముదిరింది. కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ కన్నడిగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి నిరసన ప్రదర్శన చేపట్టారు. పలు వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. బెంగళూరు బస్టాండ్ లోని పలు దుకాణాలను ధ్వంసం చేశారు. తమిళుల హోటళ్లపై దాడులకు దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జీ జరపాల్సి వచ్చింది. మొత్తానికి పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.

ఇక మరోవైపు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. కర్ణాటకకు చెందిన బస్సులపై తమిళులు తమ ప్రతాపం చూపుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని ఇరు ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఇది ఎవరో చేసింది కాదని, సుప్రీంకోర్టు ఆదేశమని, ప్రజలు సంయమనం కోల్పోవద్దని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ప్రజలను కోరారు. అలాగే విడుదల చేస్తున్న క్యూసెక్కులను తగ్గిస్తూ రోజులను పెంచాలని సుప్రీం ఆదేశించడం తమకు ఏ మాత్రం ఉపశమనం కలిగించలేదని పేర్కొన్నారు. ఈనెల 20న మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గతం నుంచీ కూడా కావేరి నది వివాదం కొనసాగుతూనే వుంది.

ఇవి కూడా చదవండి:

English summary

Tamilnadu and Karnataka states were doing severe protest and attacking their neighbour state people on Cauvery Water Dispute. So many people and Two States were struggling with this dispute. Karnataka People used to attack on Tamilnadu people and Tamilnadu Hotels and Tamilnadu Vehicles and Vice Versa.