తమిళనాట దడ పుట్టిస్తున్న నోట్ల యవ్వారం

CBI Arrests Businessman Shekhar Reddy In Chennai

11:06 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

CBI Arrests Businessman Shekhar Reddy In Chennai

పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు బ్యాంకుల దగ్గర, ఏటీఎం లదగ్గర అష్టకష్టాలు పడుతుంటే, కొందరు బడాబాబులకు దొడ్డిదారిన డబ్బులు వచ్చేసాయి. అది కూడా కోట్లకు కోట్లు. కొత్త రెండు వేల రూపాయల నోట్లు కట్టలకొద్దీ దాచేసారు. దీంతో ఐటి అధికారులు దేశవ్యాప్తంగా దాడులు మొదలెట్టారు. సీబీఐ కూడా దాడులు ముమ్మరం చేసింది. దీంతో పెద్ద చేపలు దొరుకుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తమిళనాట నోట్ల యవ్వారం గుబులు పుట్టిస్తోంది. దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత వరుస దాడులు జరుగుతున్నాయి.

కటకటాల్లో బిజినెస్ మేన్ శేఖర్ రెడ్డి...

ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి పై దాడులు జరవడంతో భారీగా నగదు , డబ్బు పట్టుబడ్డాయి. శేఖర్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.127 కోట్ల నగదు, 100 కేజీలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో శేఖర్ రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది. శేఖర్ తోపాటు ఆయన సోదరుడు, ఆడిటర్ ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వీళ్లని చెన్నైలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీళ్లకి జనవరి 3వ వరకు రిమాండ్ విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో వివిధ కింద శేఖర్ రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో శేఖర్ రెడ్డిని తమ కస్టడీకి తీసుకునేందుకు సీబీఐ వేసిన పిటిషన్ గురువారం కోర్టు ముందుకు రానుంది.

తమిళనాడు సీఎస్ ఇంటిపై ఐటి సోదాలు ...

కాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. చెన్నై అన్నా నగర్ లోని ఆయన నివాసంతో బాటు మరో ఆరు చోట్లా దాడులు నిర్వహించారు. టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాక.. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న అధికారులు వీటిని నిర్వహించడం విశేషం.

శేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రామ్మోహన రావు ఇంటిపైనా ఈ సోదాలు జరిగాయని అంటున్నారు. నోట్ల రద్దు తరువాత వందల కోట్ల నగదును ఈయన బంగారంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ముందుగా సమన్లు జారీ చేసి ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. రామ్మోహన రావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నైతో బాటు చిత్తూరు, బెంగుళూరులో ఉన్న 13 ఇళ్ళపై సోదాలు జరిగాయి.

English summary

CBI Arrests Businessman Shekhar Reddy in Chennai on Wednesday.