కింగ్‌ఫిషర్‌ పై సీబీఐ కేసు

CBI Case On Vijay Mallya

12:34 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

CBI Case On Vijay Mallya

పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.7వేల కోట్లు ఎగనామం పెడుతూ బ్యాంకులను మోసం చేసిన అంశంలో కేసు నమోదు చేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ అనిల్‌ సిన్హా వెల్లడించారు. కింగ్‌ఫిషర్‌ పై ఫిర్యాదు చేయాల్సిందిగా చాలాసార్లు బ్యాంకులను కోరినా స్పందించకపోవడంతో తామే స్వయంగా కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా తన సంస్థల నుంచి మాల్యా తప్పుకోడానికి ఇటీవల 500 కోట్ల రూపాయలు పరిహారానికి ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

English summary

Central bureau of Investigation (CBI) director Anil Sinha files a case against Kingfisher Chairman Vijay Mallya . Anil Sinha criticised Indian banks for not registering with the anti-corruption agency any complaint against Vijay Mallya for its earlier management despite the company’s default of Rs 7,000 crore.