కేజ్రీవాల్‌ కార్యదర్శి పై సిబిఐ కేసులు

CBI FIR On Kejriwals Officer Rajender Kumar

05:21 PM ON 16th December, 2015 By Mirchi Vilas

CBI FIR On Kejriwals Officer Rajender Kumar

ఇటీవల ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆఫీసులోను మరియు ఇతర ఆప్‌ మంత్రుల ఇళ్ళలోను, ప్రబుత్వ కార్యాలయాలలోనూ సిబిఐ సోదాలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్‌ ఆఫీసు, ఇంటి పై సోదాలు చేసిన సిబిఐ అతని పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు. సిబిఐ అధికారులకు రాజేంద్రకుమార్‌ ఇంట్లో 14 లిక్కర్‌ బాటిళ్ళు దొరికాయని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు. ఆ లిక్కర్‌ బాటిళ్ళను రాజేంద్రకుమార్‌ తన ఇంట్లో ఉంచినందుకు గాను అసలు ఆ విదేశి మద్యం ఎక్కడనుండి వచ్చాయన్న దానిపై సిబిఐ అధికారులు రాజేంద్రకుమార్‌ ను ప్రశ్నించనున్నారు. అంతేకాక రాజేంక్రుమార్‌ బ్యాంక్‌ అకౌంట్లో ఉన్న 28 లక్షల రూపాయలను సిబిఐ అధికారులు సీజ్‌ చేసారు.

అసలు ఢిల్లీ ప్రభుత్వం లోని వేరు వేరు విభాగాల్లొ పని చేసిన రాజేంద్రకుమార్‌ కొన్ని సంస్థలకు టెండర్లు దక్కే విధంగా చేసారని, 2007-2014 మధ్యకాలంలో 9.5 కోట్లు విలువైన కాంట్రాక్టులను ఒక కంపెనీకి దక్కేలా చేసారన్న ఆరోపణల పై రాజేంద్రకుమార్‌ పై సిబిఐ కేసులు పెట్టింది.

ఇది ఇలా ఉంటే సిఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల పై చేస్తున్న సోదాలల పై అసహనం వ్యక్తం చేసారు. కేజ్రీవాల్‌ ఆరోపణలను బిజేపి,సిబిఐ సభ్యులు వ్యతిరేకించారు.

English summary

Central beauro of investigation CBI rides on Delhi government offices and CBI file FIR on Delhi Cheif Ministers Officer Rajendra Kumar for having 14 Alcohol Bottles In His House