నెహ్రూ గొప్పతనం చాటుతూ వేడుకలు

Celebrating Nehru Birthday with his greatness

12:27 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Celebrating Nehru Birthday with his greatness

యుపి ఎ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయని విధంగా ఈసారి పండిట్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులతో పాటూ , పలు సంస్థలు నిర్వహించి , నెహ్రూ గొప్పతనాన్ని కీర్తించాయి . దీనికి కారణం లేకపోలేదు . సుభాష్ చంద్ర బోస్ అదృశ్యం మిస్టరీ తదితర ఘటనలు , నెహ్రూ విధానాల పై విమర్శలు వస్తున్న నేపధ్యంలో నెహ్రూ కీర్తిని చాటుతూ కార్యక్రమాలు చేపట్టారని చెప్పవచ్చు ,స్వాతంత్ర్య సమరంలో నెహ్రూ పోషించిన పాత్ర అద్వితీయమని ఇక భారత్ కి స్వాతంత్ర్యం సిద్ధించి నా , దేశ విభజన , మత కల్లోలాలు , పేదరికం తదితర సమస్యల ను అవలీలగా అధిగమించడానికి నెహ్రూ చేసిన కృషి అంతా ఇంతా కాదని , అంటున్నారు. ముఖ్యంగా బాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు , పంచ వర్ష ప్రణాళిక ల ద్వారా దేశ పురోభివృద్ధికి నెహ్రూ బాటలు వేసారని నవ భారత నిర్మాత నెహ్రూ ని ఎవరూ తప్పు పట్టడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. అందుకే నెహ్రూ జాతి రత్న మని అంటున్నారు. బిజెపి మూర్ఖంగా వ్యవహరిస్తూ నెహ్రూ ప్రతిష్టను మసక బారించాలని చూస్తే , అది దేశ ప్రతిష్టను మసక బార్చినట్లే అవుతుందని కాంగ్రెస్ వాదులు , నెహ్రూ అభిమానులు స్పష్టం చేస్తున్నారు. నెహ్రూ జీవితంపై ఎన్ ఎస్ యు ఐ వ్యాస రచన పోటీలు పెట్టి , విద్యార్ధులకు బహుమతులు అందించింది. పలు సంస్థలు నెహ్రూ జయంతిని నిర్వహించి , ప్రసంగాలు ఇప్పించడం విశేషం. ఇంచు మించి అన్ని పత్రికల్లో నెహ్రూపై వ్యాసాలూ , చానెల్స్ లో కధనాలు వచ్చాయి. నెహ్రూ కి బాలలంటే ఇష్టం కనుక నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరపడం రివాజని అయితే , చాలా చోట్ల నెహ్రో చిత్రపటం లేకుండా బాలల జయంతి జరిపారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో పండిట్ జవర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాంతివనంలో నెహ్రూకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఎ ఐ సిసి ఉపాధ్యక్షులు రాహుల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నెహ్రూ వ్యక్తిత్వాన్ని , పాలనా దక్షతను కొనియాడారు.

English summary

Celebrating Nehru Birthday with his greatness.Today Indian people celebrates Nehru Jayanthi greatly.