కలసి కట్టుగా ఉందాం ...

Celebrities At Nadigar Sangam celebrity cricket tournament

11:05 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Celebrities At Nadigar Sangam celebrity cricket tournament

దక్షిణ భారత నటీనటుల (నడిగర్‌) సంఘం భవన నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు ఆదివారం చెన్నైలోని చేపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో ‘నక్షత్ర క్రికెట్‌’ పేరుతో సినీ తారలకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విశ్వనటుడు కమల్‌హాసన్ టాస్‌ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించగా, తెలుగు అగ్రనటులు బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, ‘మా‘ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్, మలయాళ హీరో నివిన్‌పౌలి, కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ తదితరులు అతిథులుగా విచ్చేసి నక్షత్ర క్రికెట్‌కి మరింత జోష్‌నిచ్చారు. ఈ జట్లలో హీరోయిన్లు కూడా వున్నారు. భాష, ప్రాంతీయ భేదం లేకుండా తారలంతా ఐక్యంగా ఉందామని నక్షత్ర క్రికెట్‌ వేదికగా నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ పిలుపునిచ్చారు. నటీనటులు ఐక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, యువ తారలు ఇగోలన్నీ మర్చిపోయి కలిసి మెలసి ఆడుతుండడం చాలా సంతోషంగా ఉందని కమల్‌ పేర్కొన్నారు. ఇందుకోసమే తాను, రజనీకాంత్ కెరీర్‌ ప్రారంభం నుండే మంచి స్నేహితులుగా మెలగుతున్నామని కమల్‌హాసన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతాం.?

మండుతున్న ఎండల్లోనూ తమ అభిమాన హీరోల క్రికెట్‌ విన్యాసాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సూర్య (చెన్నై సింగమ్స్‌), కార్తి (కోవై కింగ్స్‌), విశాల్‌ (మదురై కాలైస్‌), జయంరవి (నెల్లై డ్రాగన్స్), ఆర్య (సేలం చీతాస్‌), జీవా (తంజై వారియర్స్‌), విజయ్‌సేతుపతి (రామనాద్‌ రైనోస్‌), శివకార్తికేయన్ (తిరుచ్చి టైగర్స్‌) కెప్టెన్లుగా ఎనిమిది జట్లు పోటీల్లో పాల్గొన్నాయి.

ఇవి కూడా చదవండి:

పూరీ పై 'లోఫర్' దాడి

టీడీపీలో మగాళ్లు లేరా: రోజా సవాల్‌

పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

English summary

Nadigar Sangam Celebrity Cricket Tournament was started on Chennai ina grand manner. Celebrities like Venkatest,Rajendra Prasad,Kamal Hassan,Rajinikanth,Nivin Pauly,Shiva Raj Kumar were attended to this tournament Cricket Cermony.