వరుసపెట్టి మొక్కలు నాటేస్తున్న టాలీవుడ్ స్టార్స్

Celebrities in Haritha haram event in Telangana

12:08 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Celebrities in Haritha haram event in Telangana

'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన పాపులర్ డైలాగ్ కి ఎంత క్రేజ్ వుందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు కూడా ఈ డైలాగ్ చాలామంది స్టేజ్ ల మీద పలకడం చూస్తుంటాం. ఇక మొక్కలను పెంచాలని తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ ని కదిలించింది. స్టార్స్ అంతా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అందులో మెగాస్టార్ కూడా వున్నాడు. జూబ్లీహిల్స్ లో చిరంజీవి మొక్కలు నాటాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కాంగ్రెస్ నేత, హీరో చిరంజీవి పాల్గొన్నారు.

1/11 Pages

అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున, కూకట్ పల్లిలో అమల , ఇక నటుడు రానా నానక్ రామ్ గూడలో మొక్కలను నాటాడు.

English summary

Celebrities Rakul Preet Singh, Rashi Khanna, Raj Tarun, Suman, Tanikella Bharani, Rana etc.. all are participated in this event in Telangana .