ఓటేసిన ప్రముఖులు ...

Celebrities Voted In GHMC Elections

11:38 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Celebrities Voted In GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బ్రహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లింగంపల్లిలోని 24వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బంజారాహిల్స్‌లో రోడ్‌ నంబరు 10 పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామ్‌నగర్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి కుందన్‌బాగ్‌ చిన్మయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా మైలార్‌దేవరపల్లి డివిజన్‌లోని లక్ష్మీగూడ, కొండాపూర్‌ డివిజన్‌లోని 33,35,38 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. .

English summary

Popular celebrities like Nara Lokesh,Nara Bhuwaneswari,Brahmani,Kishan Reddy,KTR,Bandaru Dattatreya and many more celebrities were utilized their vote and voted for GHMC Elections.They said that each and every one have to utilize their Vote Right