ఈ లిప్ లాక్ సీన్స్ కి కత్తెర పడలేదట

Censor Board Clears Mohenjo Daro Movie Without Cuts

10:39 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Censor Board Clears Mohenjo Daro Movie Without Cuts

కల్సి వస్తే అన్నీ అలా కల్సి వచ్చేస్తాయి ... ఇప్పుడు అదే జరిగింది. సెన్సార్ విషయం లో అడ్డంకులు ఎదురవుతాయని యూనిట్ భావించినప్పటికీ, ఎట్టకేలకు మొహెంజొదారో మూవీకి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. చివరకు మూడు లిప్ లాక్ సీన్స్ కు సైతం ఎలాంటి కత్తెరలు పడకుండా U/A సర్టిఫికెట్ రావడం కూడా గ్రేట్ అంటున్నారు. ఇక థియేటర్స్ కు రావడమే మిగిలింది. 100 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ గా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతా రెడీ కావడంతో ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

హిస్టరీ నేపథ్యం సినిమా కావడంతో మూడు లిప్ లాక్ సీన్స్ అవసరం ఏర్పడింది. కష్టపడి ఇలాంటి సీన్స్ తెరకెక్కించినా ఫైనల్ గా సెన్సార్ చేతిలో కటింగ్ పడుతుందని యూనిట్ సభ్యులు భావించారు. సన్నివేశాలకు తగ్గట్టుగా ఇలాంటి సన్నివేశాలు చేయడంలో తప్పేముందని పూజా హెగ్డే చెప్పిందట.

ఇక ముద్దు సీన్ల విషయంలో ఫిల్మ్ మేకర్స్- సెన్సార్ బోర్డు మధ్య పెద్ద దుమారం చెలరేగింది. ఈ విషయంలో హైకోర్టు అక్షింతలు వేయడంతో బోర్డు సభ్యులు తమ తీరు మార్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. జేమ్స్ బాండ్ సినిమా మొదలు తమాషా , దో లబ్జోంకీ కహానీ వంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. ఇటీవల ఉడ్తా పంజాబ్ ఫిల్మ్ రిలీజ్ టైమ్ లో సెన్సార్ బోర్డ్ సభ్యుల తీరుపై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. సీన్లు కత్తిరించడం కాదు.. సర్టిఫికెట్ జారీ వరకే మీ బాధ్యత! సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టమని న్యాయస్థానం మందలించింది. దీంతో తమ సినిమా సెన్సార్ ను అధిగమించి సర్టిఫికెట్ రావడంతో దర్శకనిర్మాతలు రియాక్స్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:నేను పోర్న్ స్టార్ అవ్వడానికి నా తల్లిదండ్రులే కారణం!

ఇవి కూడా చదవండి:ఈ అమ్మాయిలు రోడ్డుపై ఏం చేస్తున్నారో చూస్తే ముక్కుపై వేలేసుకుంటారు!

English summary

Bollywood Action Hero Hrithik Rosdhan's latest film was Mohenjo daro and Censor board gives U/A certificate to this movie with no cuts along with three lip kiss scenes.