కిస్సు మీదా కత్తెరేసారు...

Censor Board Cuts 18 Seconds Kiss Scene To 9 Seconds

12:54 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Censor Board Cuts 18 Seconds Kiss Scene To 9 Seconds

ఈ మధ్య సెన్సార్ సర్టిఫికెట్స్ విషయంలో కొంచెం కఠువుగా వ్యవహరిస్తోందా అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయ్. బాలీవుడ్ మూవీ ఉడ్తా పంజాబ్ మేకర్స్ కు, సెన్సార్ బోర్డ్ కు మధ్య రోజు రోజుకూ వివాదం పెరుగుతుండగా, తాజాగా మరో మూవీలోని కిస్ సీన్ పై బోర్డు కత్తెర వేసింది. దో లఫ్జోం కీ కహానీ చిత్రంలో హీరో రణదీప్ హుడా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మధ్య 18 సెకండ్లపాటు ఉన్న ముద్దు సన్నివేశంపై సెన్సా రోళ్ళు కస్సుమన్నారట. ఈ సీన్ ని సగానికి అంటే 9 సెకండ్లకు కుదించింది.

ఈ విషయాన్ని డైరెక్టర్ దీపక్ తిజోరి కన్ఫాం చేశాడు. తమ సినిమాలో ఈ సీన్ కి ఒక్కటే సెన్సార్ కత్తెర పడిందని, దీన్ని బోర్డు సూచన మేరకు 9 సెకండ్లకు కట్ చేశామని తెలిపాడు. మిగిలిన సీన్స్ అన్నీ యధాతధంగా ఉంటాయని చెప్పాడు. ఇక కొన్ని తిట్టు పదాలకు బోర్డు అభ్యంతరం చెప్పిందని, వాటిని కూడా తీసేశామని దీపక్ అంటున్నాడు. ఇక పూర్తి రొమాంటిక్ కామెడీ అయిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి:ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు...

ఇవి కూడా చదవండి:ఈమెతో ప్రేమలో పడ్డప్పుడు ఎన్టీఆర్ ఫోన్ బిల్ తెలిస్తే షాకౌతారు!

English summary

Censor Board has reduced the time kissing Between Kajal Agarwal and Randeep Hooda in the Do Lafzon Ki Kahani movie. The actual length of the kissing scene was 18 seconds but censor board has reduced it to just 9 seconds.