'బెంగాల్‌ టైగర్‌' కు యూ/ఏ సర్టిఫికెట్‌..

Censor Board gave U/A certificate to Bengal Tiger movie

12:40 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Censor Board gave U/A certificate to Bengal Tiger movie

రచ్చ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. ఈ చిత్రంలో మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటిస్తుండగా తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు వాళ్ళు 'యూ/ఏ' సర్టిఫికెట్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రవితేజ తరహా యాక్షన్‌ మరియు కామెడీ ఎలిమెంట్స్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయని దీనితో పాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్‌ సీన్స్‌కి చిత్రంలో పెద్దపీట వేశామని చెప్పారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందించారు.

English summary

Censor Board gave U/A certificate to Bengal Tiger movie which was directed by Sampath Nandi. Thamanna Bhatia and RaashiKhanna pairing first time with Raviteja.