'కృష్ణాష్టమి' సెన్సార్‌ పూర్తి

Censor Completed For Krishnashtami Movie

03:41 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Censor Completed For Krishnashtami Movie

కమీడియన్‌ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరొ నుండి మాస్‌ హీరోగా ప్రమోట్‌ అయిన నటుడు సునీల్‌. 'భీమవరం బుల్లోడు' తరువాత సునీల్‌ రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న ఈ చిత్రం 'కృష్ణాష్టమి' 'జోష్‌' ఫేమ్‌ వాసూవర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 19 న విడుదలవబోతున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి చేసుకుంది. 'కృష్ణాష్టమి' కి సెన్సార్‌ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. 134 నిముషాల నిడివి గల ఈ చిత్రానికి దినేష్‌ కలగరత్నం సంగీతం అందించాడు. కోన వెంకట్‌ ఈ చిత్రానికి కథని అందించాడు.

English summary

Comedian turned hero Sunil's upcoming film was "Krishnashtami".Dimple dimple chopade and nikki galrani were acted as heroines and Josh fame vasu varma was directing this movie.Censor board gives clean U/A certificate to this movie.