డిసెంబర్‌ 11నుంచి నరసరావుపేట మునిసిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు

Centenary celebrations for narasarao pet municipality

01:26 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Centenary celebrations for narasarao pet municipality

నూరు వసంతాల వేడుక అంటే చేసే సందడి అంతా ఇంతా కాదు ... ఆ ప్రత్యేకతే వేరు. తాజా గా గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం శత వసంతాలు పూర్తిచేసుకుంది. దీంతో శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి విస్తృతఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వివిధ శాఖల అధికారులు, ఉత్సవకమిటీల కన్వీనర్లతో సమీక్షించారు. పట్టణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. 300 పడకల ప్రభుత్వఆస్పత్రి, భూ గర్భ డ్రెయినేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో నిర్మిస్తున్న 12 వేల మరుగుదొడ్లను ప్రారంభిస్తామన్నారు. పేదలకు 1,500 గృహాలు నిర్మించనున్నామని తెల్పారు.

English summary

Centenary celebrations for Narasarao pet municipality,Narasaraopet municipality celebrates 100years function on December 11.Narasaraopet municipality completed 100years so they celebrates on December 11,12,13