అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు కి కేంద్రం ఒకే ....

Central Government Approves Outer Ring Road For Amaravathi

03:19 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Central Government Approves Outer Ring Road For Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా అమరావతిలో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి డీపీఆర్‌ తయారు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్రవేసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందించింది.

కాగా విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాంతీయ కార్యాలయానికి ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్రానికి కేంద్రం సమాచారమందించింది. చిలకలూరిపేటకు బైపాస్‌ హైవే ఏర్పాటుపై డీపీఆర్‌ తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కన్సల్టెన్సీని నియమించింది. జులై నాటికి నివేదిక అందజేయాలని కన్సల్టెన్సీకి ఆదేశించింది.

విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణానికి శంఖుస్థాపన సందర్భంగా కేంద్ర రహదారుల మంత్గ్రి నితిన్ గడ్గారి ఎపిలో రహదారుల ప్రాజెక్టులకు అనుకూలంగా స్పందించి , దాదాపు 65 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో కేంద్రం ఆమోదం తెల్పింది.

English summary

Reports saying that Central Government Approves Outer Ring Road For Amaravathi,capital of Andhra Pradesh.