కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయం!

Central Government To Reshuffle Cabinet Ministers

12:22 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Central Government To Reshuffle Cabinet Ministers

ప్రధాని గా బాధ్యతలు చేపట్టాక మరోసారి కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది అసోం, పశ్చిమ్‌బంగ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని పాలన వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాజిక సమీకరణాల సంతులనానికీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ,బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా భావిస్తున్నారు.రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) సీనియర్‌ నేత కృష్ణగోపాల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సమావేసంయ్యారు. ఆదివారం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ లో కీలక అంశాలు చరిన్చినట్లు బోగట్టా. ఈ కీలకభేటీ అనంతరం కనీసం అయిదుగురు మంత్రులకు ప్రధాని నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయని అంటున్నారు. ఆయా మంత్రిత్వశాఖల్లో కొలిక్కి తీసుకురావాల్సిన పనుల్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. . కమల దళపతి గా అమిత్‌ షా రెండోసారి ఎన్నికయ్యాక కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ‘ఈ నెలాఖరులోగా అమిత్‌షా రెండోసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికవుతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతాయి. ఈ రెండింటికి మధ్యలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమని అంటున్నారు. కనీసం అయిదుగురు మంత్రులకు ప్రధాని ఇచ్చిన ఆదేశాలే దానికి సూచిక’ అని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.

మంత్రివర్గం నుంచి తొలగించే కొందరికి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్నవారిలో అనుభవజ్ఞుల సంఖ్య తక్కువగానే ఉండడం వలన మార్పులు అనివార్యంగా భావిస్తున్నారు. 2014 నవంబరు 9న ప్రధాని మోదీ తొలిసారిగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. త్వరలో చేయబోయేది రెండో పునర్వ్యవస్థీకరణ కానుంది. కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల్లో ఎలాంటి మార్పులు ఉండక పోవచ్చని అంటున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌లను మారుస్తారన్న మాట వినిపిస్తోంది. ఇక మిత్ర పక్షాల కు కేటాయించిన శాఖల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది ఇంకా తేలలేదు. బహుశా మిత్రుల శాఖలు ఇప్పట్లో మార్చక పోవచ్చని తెలుస్తోంది. ఏమో చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చు కదా.

English summary

Central government to reshuffle cabinet ministers.Amith shah to elect as BJP president for the second time