సైట్ కి చేరిన సాయం వివరాలు ...

Central Government Uploads AP Special Package Details On Website

11:17 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Central Government Uploads AP Special Package Details On Website

ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ప్రకారం చేయబోయే సాయాన్ని మొన్న అర్ధరాత్రి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ఏం సాయం చేయబోతున్నారో , అందుకు సంబంధించిన వివరాలను కేంద్రం పీఐబీ వెబ్సైట్లో పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ ఏపీకి ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటనను యధాతథంగా గురువారం వెబ్సైట్ లో పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలను కలిగించామని సైట్లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనేజేషన్ యాక్ట్లో ఉన్న మేరకు ఏ రకమైన సాయం చేయాలనే విషయాన్ని వెబ్ సైట్లో ఉంచారు.

ఇది కూడా చూడండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

నాలుగు కేటగిరీల కింద ఏపీకి ప్రత్యేకసాయం అంటూ నీతి ఆయోగ్ సిఫార్సులను ఈ వెబ్ నోట్లో పొందుపరిచారు. సెక్షన్ 90 ప్రకారం పోలవరాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేయాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలతోపాటు 13 షెడ్యూల్లో ఏయే అంశాలు ఉన్నదీ, సంస్థలు ఏ విధంగా విభజన చేయాలన్నది కూడా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన స్టేట్మెంట్, ఆ తర్వాత వచ్చిన 14 ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందనే వివరాలను వెబ్సైట్లో ఉంచిన నోట్ ద్వారా తెలిపారు. ఇవి తప్ప... ఏపీకి లక్షా 50 వేల కోట్ల సాయం అంటూ తాజాగా వచ్చిన ఊహా గానాల ఊసు కూడా అందులో లేకపోవడం కొసమెరుపు.

ఇది కూడా చూడండి: నిద్రలో హఠాత్తుగా మిమ్మల్ని కుదిపినట్టు అనిపించిందా? దానికి కారణాలు ఇవే..

ఇది కూడా చూడండి: పాము కాటేస్తే ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగో తెలుసా ?

English summary

Central Government Uploads AP Special Package Details On Website.