స్థిరాస్తి నియంత్రణ బిల్లు తెస్తాం: వెంకయ్య

Central Govt Bring Fixed Asset Control Bill

06:18 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Central Govt Bring Fixed Asset Control Bill

త్వరలో స్థిరాస్తి నియంత్రణ బిల్లు తీసుకు వస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వినియోగదారులకు మేలు చేసేందుకు స్థిరాస్తి నియంత్రణ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. విజయవాడ మధుమహాలక్ష్మి ఛాంబర్‌లో శనివారం చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో స్థిరాస్తి ప్రదర్శనను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

కాగా ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంలా కనిపిస్తోందని, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడే సురక్షితమని ఎంతోమంది భావిస్తున్నారని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అమరావతి, ఓరుగల్లును త్వరలోనే వారసత్వ నగరాలుగా గుర్తిస్తామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని ఆయన సూచించారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి నేటితరం బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

English summary

Central minister venkayya naidu said that central government to bring fixed asset control bill