ఎపిలో 65 వేల కోట్ల నూతన జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం 

Central Govt Sanctions 65 thousand Crores to A.P

01:10 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Central Govt Sanctions 65 thousand Crores to A.P

ఎపిలో నూతన జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని రహదారుల ప్రాజెక్టులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయలు ఇందుకోసం కేటాయిస్తుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్గారి ప్రకటించారు. . విజయవాడలో దుర్గ గుడి ఫ్లై ఓవర్ వంటన, రోడ్డు విస్తరణ పనులకు బెంజి సర్కిల్ దగ్గర శనివారం కేంద్రమంత్రి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎపి పై వరాల జల్లు కురిపించారు. 2016 నాటికి డిపిఆర్ , భూసేకరణ పూర్తిచేస్తే , ప్రాజెక్టు చేపడతామని చెప్పారు. విజయవాడలొ 180 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కి ఖర్చయ్యే 20 వేల కోట్లు , 1350 కిలో మీటర్ల పొడవునా రాస్తంలో ప్రతిపాదించిన నూతన రహదారి కి కూడా ఆమోదం తెల్పుతున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఏటా 50 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆయన చెప్పారు.

విజయవాడలో జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి గడ్గారి చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో పిపిపి పద్దతిలో ద్రైవంగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. బస్ పోర్టు కోసం కూడా సహకరిస్తామని ఆయన తెల్పారు.

English summary

Central Government Sanctions 65 thousand crores for new nartional highways in andhrapradesh