సిపిఎమ్ ఎంపి వ్యాఖ్యలపై కేంద్ర హొమ్ మంత్రి అభ్యంతరం 

Central HomeMinister Opposes CPM MP Words In Parliament

01:17 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Central HomeMinister Opposes CPM MP Words In Parliament

సోమవారం లోక్ సభలో సిపిఎమ్ ఎంపి మహమద్ సలీం చేసిన వ్యాఖలపై లోక సభలో దుమారం రేగింది. ఎంపి సలీం తన వ్యాఖ్యలను నిరూపించాలని , లేదంటే క్షమాపణ చెప్పాలని హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ డిమాండ్ చేసారు. సలీం వ్యాఖలపై బిజెపి ఎంపిలు అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజ్యాంగంపై పార్లమెంట్ లో శుక్ర వారం, శనివారం చర్చ జరగ్గా , సోమవారం 193నిబంధన కింద కాంగ్రెస్ , సిపిఎమ్ ఇచ్చిన నోటీసుపై చర్చ లోక సభలో జరుగుతుండగా సిపిఎమ్ ఎంపి సలీం తనదైన శైలిలో దేశంలోని అసహన పరిస్థితులను ప్రస్తావిస్తూ అధికార పక్షం ఫై విమర్శలు గుప్పించారు. ' 'అవుట్ గోయింగే కాదు ఇన్ కమింగ్ కాల్స్ కూడా స్వీకరించాలి. ఎవరి ఇంట్లో ఏమి వండుకుంటున్నారన్నది ప్రధానం కాదు, పొయ్యి వెలిగిందా , లేదా అని చూడాలి. నేరం చేసిన వాడే కాదు , ఉపేక్షించిన వాడూ నేరం చేసినట్లే 'ఇలా ఉపన్యాసం చలోక్తులతో సాగుతోంది.

ఈ దశలోనే ' పృథ్వి రాజ్ తర్వాత దేశంలో హిందూపాలన వచ్చిందని ఎన్నికల్లో గెలిచాక హొమ్ మంత్రి మాట్లాడారు' అంటూ ఎంపి సలీం చేసిన కొన్ని వ్యాఖ్యలపై హొమ్ మంత్రి రాజ్ నాధ్ వెంటనే లేచి స్పందించారు. 'సలీం నాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి , లేదా క్షమాపణ చెప్పాలి 'అని హొమ్ మంత్రి అన్నారు. ఎంపి సలీం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బిజెపి సభ్యులు డిమాండ్ చేసారు. దీంతో ఉభయ పక్షాల మధ్య సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ చెప్పినా సరే , పరిస్థితి చక్కబడలేదు ,. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అటు రాజ్య సభ కూడా మధ్యాహ్నం వరకు వాయిదాపడింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయసభలు సమావేశం అవుతాయి.

English summary

CPM MP Muhammad Saleem words gets contreversial in parliament.Saleem talks about intolerance in india and central home minister rajnadh singh opposes his words in parliament. Speaker Sumithra Mahajan has postponed to this afternoon