అధికారులను ఇంట్లో బంధించిన కేంద్రమంత్రి

Central Minister Anupriya Patel Captured Offcials In Her House

11:10 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Central Minister Anupriya Patel Captured Offcials In Her House

కొందరు చేసే పనులు అందరికీ చుట్టుకుంటాయి. అది పెద్ద ప్రభావం చూపితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు యూపీకి చెందిన కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ చుసిన నిర్వాకం అలానే వుంది. ఇంతకీ ఈమె చేసిందేమిటంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌ చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేదట. అందుకు ఇద్దరు ఇంజనీర్లను, కాంట్రాక్టర్‌ను మంత్రి తన ఇంట్లోనే బంధించారు.

సంచలనం సృష్టించిన ఈ ఘటన శనివారం దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియను ఇటీవలే మోడీ తన కేబినెట్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. సమీప భవిష్యత్తులో యూపీ ఎన్నికలు వస్తుండడం, ఆ రాష్ట్రంలో ఓబీసీ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో అప్నా దళ్‌తో పొత్తు పెట్టుకుని, అదే సామాజిక వర్గానికి చెందిన అనుప్రియను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

అయితే తన ఇంట్లో ఆమె కొన్ని మరమ్మతు పనులు చేయిస్తున్నారు. అయితే, ఆమె చెప్పిన సమయానికి టైల్స్‌ వేయకపోతే గదిలో బంధిస్తామని కూడా ముందే చెప్పారు. చెప్పినట్లే వారిని బంధించారు. దాంతో వారు సీపీడబ్ల్యూడీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అజ్మీర్‌ సింగ్‌కు ఫోన్‌ చేశారు. ఆయన వచ్చి విడిపిస్తూ, ‘‘ఏదో ఒక కారణంతో పని ఆలస్యం అవుతుంది. అంతమాత్రాన గంటైనా రెండు గంటలైనా బంధించడం మంచి పద్ధతి కాదు. దీనిపై మంత్రితో మాట్లాడతాం తప్ప, పోలీసులకు ఫిర్యాదు చేయం. మేం ప్రతి మంత్రికీ పని చేస్తాం. వారితో తగవులు పెట్టుకోము. ఇలా జరగడం ఇదే మొదటిసారి’’ అని వివరించారు. దీనిపై అనుప్రియ భర్త ఆశిశ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదన్నారు. ‘‘ఈ భవనానికి నేను ఇన్‌చార్జిని కాదు. అయినా నేను లోపల ఉన్నా. బయటికి వచ్చేసరికి, ఆలస్యం చేస్తున్నందుకు ఇంజనీర్లను మంత్రి సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఒకవేళ, వారిని మేమే బంధించామని ఎవరైనా భావిస్తే కేసు పెట్టుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటన వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? లేదా అన్నది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:షాక్: విమానంలో ఎవరూ చేయని పని చేసింది(వీడియో)

ఇవి కూడా చదవండి:వినియోగదారులను పచ్చిగా మోసం చేసిన జియో.. అంతా మోసమే!

English summary

Uttarpradesh Apnadal Party leader and MP and Central Health and Family Welfare minister Anupriya Patel was recently captured officials in her house for delaying the renovation works in her home. This incident became viral all over UP. So many people were opposed minister Anupriya Patel.