కేంద్ర మంత్రి పొరపాటు - ఓ రేంజ్ లో ఆడుకున్న నెటిజన్లు

Central Minister Ram Vilas Shocking Tweet

10:46 AM ON 25th January, 2017 By Mirchi Vilas

Central Minister Ram Vilas Shocking Tweet

పొరపాటు చేయడం మానవ సహజం. ఒక్కోసారి పొరపాట్లు దొర్లడం కూడా సహజమే. కానీ కేంద్ర మంత్రి స్థాయిలో గల వ్యక్తులు పొరపాటు చేస్తే, నెటిజన్లు ఊరుకుంటారా? అందుకే ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమంటే, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ తనను కలిసేందుకు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పేరును పినరాయ్ విజయన్ అని కాకుండా పనీర్ సెల్వమ్ అంటూ తమిళనాడు సిఎం పేరు రాసి ట్వీట్ చేశారు. ఈవిధంగా పొరపాటు చేశారు. ఢిల్లీలోని తన నివాసం 12 జన్‌పథ్‌లో కేరళ సిఎం పనీర్ సెల్వమ్ ఆయన అధికార బృందం కలిసిందని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి అయ్యుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరునే తప్పుగా రాయడంతో నెటిజన్లు రాం విలాస్ పాశ్వాన్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. తన తప్పిదాన్ని గుర్తించి ట్వీట్ తొలగించేలోగానే కేంద్ర మంత్రి ట్వీట్‌ను నెటిజన్లు వైరల్ చేశారు. అసలు విషయం తెలుసుకుని నాలిక్కరచుకున్న రాం విలాస్ పాశ్వాన్ ఆ తర్వాత తప్పు సరిదిద్దుకున్నారు. తనను కలిసేందుకు కేరళ సిఎం పినరాయ్ విజయన్ టీం వచ్చిందంటూ మళ్లీ ట్వీట్ చేశారు. పాత ట్వీట్‌ను డిలీట్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి పొరపాట్లు చేయడం తగదని నెటిజన్లు సూచిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి: న్యూస్ పేపర్లపై ఈ చుక్కలు… ఎందుకో తెలుసా..?

English summary

Central Minister Ram Vilas Shocking Tweet.