చెప్పులు కుట్టించుకుని కేంద్రమంత్రి ఎంత ఇచ్చారంటే...

Central Minister Smriti Irani pays Rs 100 to cobbler for repairing her slippers

11:57 AM ON 28th November, 2016 By Mirchi Vilas

Central Minister Smriti Irani pays Rs 100 to cobbler for repairing her slippers

మాములుగా చెప్పులు తెగిపోతే కుట్టించుకున్నాక పదో పరకో ఇస్తాం. మహా అయితే పాతిక, ముప్పై ఇస్తాం. కానీ తెగిపోయిన తన చెప్పులను మరమ్మతు చేసి ఇచ్చినందుకు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఎంతిచ్చారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది. ఎందుకంటే, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అయిపొయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే,...

ఇషా ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి స్మృతి విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు. విమానం దిగుతుండగా ఆమె చెప్పులు తెగిపోయాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు విమానాశ్రయం నుంచి కారులో వెళ్తూ చెప్పులు కుట్టే వ్యక్తి కోసం మంత్రి చూస్తుండగా పెరూరులో చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించారు. వెంటనే ఆమె కారు ఆపి అతడి వద్దకు వెళ్లి చెప్పులు కుట్టించుకున్నారు.

కుడుతున్నంత సేపు ఆమె అక్కడే స్టూలుపై కూర్చుకున్నారు. చెప్పులు కుట్టిన ఇచ్చిన అతడు మంత్రిని పది రూపాయలు అడిగాడు. వెంటనే స్మృతి వంద రూపాయలు అతడి చేతిలో పెట్టి చిల్లర వద్దులే అని చెప్పారు. దీంతో సంతోషించిన అతను మళ్లీ మంత్రి చెప్పులు తీసుకుని మరికొన్ని కుట్లు వేసి ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చెప్పులు కుడుతున్నంత సేపు ఆమె అక్కడే స్టూలుపై కూర్చోవడం, డబ్బులు నేరుగా అతడి చేతిలో పెట్టడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె నిరాడంబరతను కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి: మోడీ పేరు తప్పుగా రాసి& పెళ్లికి ఆహ్వనించిన యువరాజ్.!

ఇవి కూడా చదవండి: మీ అబ్బ సొత్తా అంటూ మోడీని నిలదీశాడు!

English summary

Central Minister Smriti Irani was recently praised by many people in Social Media by saying that she gave Rs 100 to cobbler for getting her slippers repaired.