‘ఉగ్ర’దాడులు జరగొచ్చు: నిఘా వర్గాలు

Centre asks all state governments to remain vigil during new year

04:35 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Centre asks all state governments to remain vigil during new year

నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు యత్నించే అవకాశం ఉందని...

నూతన సంవత్సర వేడుకలను ఇందుకు వేదిక చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని... అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించాయి. పాక్‌ నుంచి 15-20 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని.. ముంబయి తరహా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

English summary

Central Government issued an advisory to all state governments and UT to be vigilant throughout new yr festivities to foil any terror assault.